MPs celebrate TDP 43rd Foundation Day in Delhi : తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవాలను ఆ పార్టీ ఎంపీలు దిల్లీలో ఘనంగా జరుపుకున్నారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు నివాసంలో నిర్వహించిన వేడుకల్లో కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు సహా టీడీపీ ఎంపీలు పాల్గొన్నారు. పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి పరస్పరం తినిపించుకున్నారు. అనంతరం కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ "ఎన్టీఆర్ స్ఫూర్తి, చంద్రబాబు దార్శనికత, లోకేశ్ పట్టుదల, కార్యకర్తల కష్టం వల్ల టీడీపీ దేశంలోనే కీలకపాత్ర పోషించే స్థితికి చేరింది. ఎలాంటి కష్టాలు వచ్చినా టీడీపీ తట్టుకొని నిలబడింది.