YSRCP Ippala Meeting with Lokesh Sparks Controversy : అసలేం జరుగుతోంది సార్, సగటు తెలుగుదేశం కార్యకర్త ప్రభుత్వ పెద్దలకు సంధిస్తున్న ప్రశ్నాస్త్రం ఇది. వైఎస్సార్సీపీ శ్రేణులతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎలాంటి సంబంధం పెట్టుకోవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు బహిరంగంగానే నాయకులకు దిశానిర్దేశం చేస్తుంటే, కొందరు వైఎస్సార్సీపీ శ్రేణులు మాత్రం అందరి కళ్లుగప్పి వ్యవహరిస్తున్న తీరు విస్మయానికి గురిచేస్తోంది. జరుగుతున్న నష్టంపై సోషల్ మీడియా వేదికగా ఎదురుదాడికి దిగితేనే ప్రభుత్వ పెద్దలు మేల్కొని దిద్దుబాటు చర్యలు చేపడతున్నారు.