Raghu Rama Krishna Raju Comments on Custodial Torture Case: సీఐడీ కస్టడీలో తనను కొట్టించిన పెద్దలెవరో త్వరలోనే బయటకు వస్తుందని ఉపసభాపతి రఘురామకృష్ణరాజు అన్నారు. సీఐడీ మాజీ అధికారి విజయ్ పాల్‌పై కేసు కొట్టేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడాన్ని రఘురామకృష్ణరాజు స్వాగతించారు. ఓడిపోతామని వారు ఊహించలేదని, ఈ కేసులో విచారణ మరింత వేగవంతం అవుతుందని ఆశిస్తున్నానన్నారు. విచారణలో తనకు తెలిసిన నిజాలు అన్నీ చెప్పానని, అత్యుత్సాహం చూపిన అధికారులు తగిన ఫలితం చూస్తున్నారని పేర్కొన్నారు.