Rain Water Came into The Electric TGS RTC Bus : శుక్రవారం (నవంబర్ 01)న సాయంత్రం ఓ ఆర్టీసీ బస్సులోకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో ప్రయాణికులు పెద్దగా అరుపులు, కేకలు పెట్టారు. అందులో ఉన్న ఓ ప్రయాణికుడు వీడియో తీసి సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది జరిగింది ఎక్కడో వరద ప్రాంతంలో కాదు మన రాజధాని నగరం హైదరాాబాద్లో. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ బస్ డిపోకు చెందిన ఎలక్ట్రిక్ బస్సు నిన్న ప్రయాణికులతో హఫీజ్పేట్ నుంచి కొండాపుర్ మార్గంలో వెళ్తోంది.