తిండి కలిగితే కండ కలదోయ్ అన్నారు మహాకవి గురజాడ అప్పారావు. అయితే, నాణ్యత ప్రమాణాలు లేని, కలుషిత ఆహారం ఎంత తీసుకున్నా...తిప్పలు తప్పవు అంటున్నారు వైద్యులు. ఇది నూటికి నూరు శాతం వాస్తవమేనని తేలుతోంది. మనుషి ఆరోగ్య సమస్యలకు మూల కారణం నాణ్యత లేని, కలుషిత ఆహారం తీసుకోవడమే అని ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా పలు ఆరోగ్య నివేదికలు ఇదివరకే కుండబద్దలు కొట్టేశాయి. కలుషిత ఆహారం తీసుకోవడం వల్ల 10 మందిలో ఒకరు అనారోగ్యం బారిన పడుతున్నారు. 60 కోట్ల మంది మరణిస్తున్నారు. ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో బాధితులు పెరిగి, మరణాలు అధికం అయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి, ఆహారం కలుషితం కాకుండా ఆపేదెలా? ఆహారం కలుషితం కావడానికి గల కారణాలు ఏంటి? కలుషిత ఆహారం తీసుకోకుండా ప్రజల్లో అవగాహన పెంచడం ఎలా? ఇప్పుడు చూద్దాం.