Telangana Cabinet Expansion Latest : సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకుని రాగానే కాంగ్రెస్లో పదవుల భర్తీ జరుగుతుందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నెల 17, 18 తేదీల్లో మంత్రివర్గ విస్తరణ, పీసీసీ ఎంపిక, నామినేటెడ్ పదవుల భర్తీలకు సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు చెబుతున్నాయి. ఆరు మంత్రి పదవులు ఉన్నప్పటికీ, నాలుగు మాత్రమే భర్తీ చేసే అవకాశం ఉందని పీసీసీ వర్గాలు పేర్కొంటున్నాయి. మంత్రి పదవులు ఆశిస్తున్న కొందరు ఎమ్మెల్యేలకు ఆర్టీసీ, పౌర సరఫరాలు వంటి నామినేటెడ్ పదవులు ఇచ్చి క్యాబినెట్ హోదా కల్పించి సంతృప్తి పరిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.