Problems of TIDCO Houses Residents: గతంలో తెలుగుదేశం హయాంలో దాదాపు 90 శాతం పూర్తయిన టిడ్కో ఇళ్లను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. పల్నాడు జిల్లా నరసరావుపేట శివారు కేసానుపల్లిలో నిర్మించిన 15 వందల 4 టిడ్కో ఇళ్లను నాలుగేళ్లకు పైగా ఖాళీగా ఉంచారు. అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించకుండానే ఎన్నికల ముందు హడావుడి చేసిన జగన్ సర్కార్, లబ్ధిదారుల జాబితాలో మార్పులు చేసి 500 మందికి మాత్రమే ఇళ్లు పంపిణీ చేసి చేతులు దులుపుకుంది. సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, రుణాలు చెల్లించాలని బ్యాంకులు ఒత్తిడి చేస్తున్నాయని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.