Indiramma Housing Scheme First Phase 2024 : రాష్ట్రంలో త్వరలో రెండు పడకగదులతో నిర్మించే ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించనున్నట్లు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క వెల్లడించారు. ప్రతి శాసనస నియోజకవర్గం పరిధిలో 3500 ఇళ్ల చొప్పున రాష్ట్రంలో 4.50 లక్షల ఇళ్లు నిర్మించి ఇస్తామని వెల్లడించారు. ఆదిలాబాద్ జిల్లా పిప్రిలో అధికారయంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో ఆయన పాల్గొని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టబోయే ఇళ్ల నిర్మాణం గూర్చి వెల్లడించారు.