Son Abusing Senior Citizen Parents : అతనో పోలీసు అధికారి. ప్రజలకు రక్షణ కల్పించడం అతని విధి. ఆ అధికారి నుంచే తమను కాపాడాలంటూ కన్న తల్లిదండ్రులే ఉన్నతాధికారులకు మొరపెట్టుకున్నారు. ఆస్తి కోసమై తమ కన్నబిడ్డే కసాయిగా మారి వేధింపులు గురి చేస్తున్నాడని, తమకు రక్షణ కల్పించాలని వారు వేడుకున్నారు. వనపర్తి జిల్లా ఖల్లా ఘనపురానికి చెందిన బాధిత వృద్ధ దంపతులు రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారు.