junior doctors protest: హైదరాబాద్ ఉస్మానియా, గాంధీ మెడికల్ కళాశాల జూనియర్ డాక్టర్లు సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేపట్టారు. కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలియజేశారు. కొన్నేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 24 నుంచి సమ్మెలోకి దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.