ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తరువాత తన లక్ష్యం ఏంటో స్పష్టంగా నిర్దేశించికున్న సీఎం జగన్ ఆ దిశగా అడుగులు మాత్రం జాగ్రత్తగా వేస్తున్నారు. తనను ఎవరైతే లెక్క చేయటం లేదో..ఎవరైతే టార్గెట్ చేస్తున్నారో వారికి తన మార్క్ దెబ్బ మాత్రం రుచి చూపిస్తున్నారు. ఇదే విషయం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ తో పాటుగా సినీ ఇండస్ట్రీల్లోనూ వినిపిస్తోంది. ముఖ్యమంత్రి అయిన తరువాత క్రమేణా రాష్ట్రం పైన చంద్రబాబు ముద్ర తొలిగించే ప్రయత్నం చేసారు.