AP Assembly Election 2019 : Kaikalur Assembly Constituency Report || Oneindia Telugu
  • 5 years ago
AP Assembly Election 2019:Know detailed information on Kaikalur Assembly Constituency in video. Get information about election equations, demographics, social picture, performance of current sitting MLA, election results, winner, runner up, & much more on Kaikalur.
#APAssemblyElection2019
#KaikalurAssemblyConstituency
#KamineniSrinivas
#RamPrasadUppala
#ysrcp
#bjp

2009 నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌లో భాగంగా..కైక‌లూరు, క‌లిదిండి, ముదినేప‌ల్లి, మండ‌వ‌ల్లి మండ‌లాల‌తో ఈ నియోజ‌క వ‌ర్గం ఏర్ప‌డింది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో రెండు సార్లు మాత్ర‌మే టిడిపి గెలిచింది. ఇక‌, 2009 డీ లిమిటేష‌న్ లో భాగంగా ముదినేప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం ర‌ద్దు అయింది. ఇది హేమాహేమీల నియోజ‌క‌వ‌ర్గంగా పేరుండేది. పిన్న‌మ‌నేని కోటేశ్వ‌ర‌రావు ఇదే నియోజ‌క‌వ‌ర్గం నుండి 2 సార్లు గెలుపొందారు. ఆయ‌న కుమారుడు వెంక‌టేశ్వ‌ర‌రావు ఇక్క‌డి నుండి 3 సార్లు గెలిచారు. ఆయ‌న 2004 లో వైయ‌స్ క్యాబినెట్ లో మంత్రిగా ఉన్నారు. ఇదే నియోజ‌క‌వ‌ర్గం నుండి గెలిచిన ఎర్నేని సీతాదేవి టిడిపి ప్ర‌భుత్వం లో మంత్రిగా ప‌ని చేసారు. ఇక‌, కైక‌లూరు నియోక‌వ‌ర్గంలో మాజీ ఎంపి క‌నుమూరి బాపిరాజు కైక‌లూరు లో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయ‌న మంత్రిగా ప‌ని చేస్తూ ఆరోప‌ణ‌ల‌తో రాజీనామా చేసారు. 2009 లో ఇక్క‌డ పీఆర్పీ నుండి పోటీ చేసిన కామినేని శ్రీనివాస్ 2014 లో బిజెపి లో చేరారు.
Recommended