AP Assembly Election 2019 : Kurnool Assembly Constituency,Sitting MP, MP Performance Report
  • 5 years ago
AP Assembly Election 2019:Know detailed information on Kurnool Assembly Constituency in video. Get information about election equations, sitting MP, demographics, social picture, performance of current sitting MP, election results, winner, runner up, & much more on Kurnool.
#APAssemblyElection2019
#KurnoolAssemblyConstituency
#S.V.MohanReddy
#T.G.Venkatesh
#ysrcp
#tdp

2009లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన టిజి వెంక‌టేష్ 2014 ఎన్నిక‌ల ముందు టిడిపిలో చేరారు. ఎస్వీ కుటుంబం వైసిపి లో చేర‌టం తో ఎస్వీ మోహ‌న‌రెడ్డికి క‌ర్నూలు ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చారు. గ‌తంలో ఆయ‌న ఎమ్మెల్సీగా ప‌ని చేసారు. 2014 ఎన్నిక‌ల ముందు వైసిపి లో చేరి బ‌రిలో నిలిచారు. ఆ ఎన్నిక‌ల్లో మొత్తం 2,45,672 మంది ఓటర్లు ఉండ‌గా.. అందులో 1,43,517 ఓట్లు పోల‌య్యాయి. అందులో వైసిపి అభ్య‌ర్ధి మోహ‌న‌రెడ్డికి 57,962 ఓట్లు రాగా, టిడిపి నుండి పోటీ చేసిన టిజి వెంక‌టేష్ కు 54,483 ఓట్లు వ‌చ్చాయి. వైసిపి అభ్య‌ర్ధి 3,479 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆ త‌రువాత మోహ‌న‌రెడ్డి సోద‌రి శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మ‌ర‌ణించ‌టం..బావ భూమా నాగిరెడ్డి- మేన కోడ‌లు అఖిల‌ప్రియ టిడిపిలోకి చేర‌టంతో..మోహ‌న‌రెడ్డి సైతం టిడిపిలో కి వెళ్లిపోయారు. ఇక, 2014 ఎన్నిక‌ల్లో ఇక్క‌డి నుండి వైసిపి అభ్య‌ర్ధిగా గెలిచిన మోహ‌న‌రెడ్డి ప్ర‌స్తుతం టిడిపిలో ఉన్నారు. దీంతో..వైసిపి నుండి ఇక్క‌డ మైనార్టీ అభ్య‌ర్దికి అవ‌కాశం ఇస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇదే నియోజ‌క‌వ‌ర్గంలో గ‌త ఎన్నిక‌ల్లో టిడిపి అభ్య‌ర్ధిగా పోటీ చేసిన టిజి వెంక‌టేష్ ప్ర‌స్తుతం రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఉన్నారు. త‌న కుమారుడు టిజి భ‌ర‌త్ కు క‌ర్నూ లు టిడిపి టిక్కెట్ ఇప్పించుకోవాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అయితే, ఎస్వీ మోహ‌న‌రెడ్డి త‌న‌కే సీటు ద‌క్కుతుందనే న‌మ్మ‌కంతో ఉన్నారు. ఇక‌, జ‌న‌సేన సైతం ఇక్క‌డి నుండి బ‌రిలో దిగ‌టానికి అభ్య‌ర్ధిని ఖ‌రారు చేసే ప‌నిలో ప‌డింది. దీంతో..ఇక్క‌డ వ‌చ్చే ఎన్నిక‌ల్లో హోరా హోరీ పోరు సాగే అవ‌కాశం ఉంది.
Recommended