FIFA 2018: Belgium Vs France Match Preview
  • 6 years ago
ఫిఫాలో భాగంగా.. మంగళవారం జరిగే సెమీఫైనల్లో ఫ్రాన్స్‌ జట్టు.. బెల్జియంను ఢీకొంటుంది. చిరకాల ప్రత్యర్థులైన ఈ రెండు జట్ల మధ్య ముఖాముఖిలో బెల్జియందే పైచేయి. ఐతే ప్రపంచకప్‌లో మాత్రం ఆధిపత్యం ఫ్రాన్స్‌దే. బెల్జియంతో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ నెగ్గింది. ఫ్రాన్స్‌ ఓసారి ప్రపంచకప్‌ నెగ్గగా.. 'రెడ్‌ డెవిల్స్‌' తొలిసారి ఫైనల్లో అడుగుపెట్టేందుకు తహతహలాడుతోంది. క్వార్టర్‌ఫైనల్లో బెల్జియం 2-1తో ఫేవరెట్‌ బ్రెజిల్‌కు షాకివ్వగా.. ఫ్రాన్స్‌ 2-0తో ఉరుగ్వేను ఓడించింది.
ఈ జట్లు చివరిసారి 1986 ప్రపంచకప్‌లో తలపడ్డాయి. ఐతే ఎటాకింగ్‌లోనూ, డిఫెన్స్‌లోనూ నువ్వా నేనా అన్నట్లు కనిపిస్తున్న బెల్జియం, ఫ్రాన్స్‌లలో విజేతను అంచనా వేయడం కష్టమైన పనే. అదే ఈ మ్యాచ్‌ను అత్యంత ఆసక్తికరంగా మారుస్తోంది. అన్ని విభాగాల్లో ఢీ అంటే ఢీ అనేలా ఉన్న రెండింటి మధ్య 'మాజీ చాంపియన్‌' హోదా ఒక్కటే తేడా. 1998లో విజేతగా నిలిచిన ఫ్రాన్స్‌... తర్వాత పడుతూ లేస్తూ ప్రయాణం సాగి స్తోంది. ఈసారి గ్రీజ్‌మన్‌ వంటి ఆటగాడికి ఎంబాపెలాంటి మెరిక తోడవడంతో ఆటతీరుతోపాటు జట్టు రాతే మారిపోయింది.

The World Cup semifinals begin on Tuesday with a match loaded with top-tier talent and with the potential for plenty of goals. France, a one-time World Cup champion, and Belgium face off in Saint Petersburg for a spot in the final, where they'll play either Croatia or England on Sunday in Moscow. This contest features French superstars Paul Pogba and Antoine Griezmann going up against Belgian superstars Eden Hazard, Kevin De Bruyne in what's surely to be an intense, back-and-forth battle.
#football
#belgium
#france
#fifaworldcup
#russia2018
Recommended