Nigeria Penalty Claim: John Obi Mikel's Shock VAR Claim After Argentina World Cup Decision
  • 6 years ago
The Super Eagles had worked themselves back into a position to make the last 16 of World Cup 2018 after responding positively to an early opener from Lionel Messi.
#argentina
#nigeria
#worldcup2018
#footballworldcup
#fifaworldcup2018

రష్యా వేదికగా జరుగుతోన్న ఫిఫా ప్రపంచకప్‌ పోటీలు అనూహ్య ఫలితాలు తెచ్చి పెడుతున్నాయి. ఎంతో ఆసక్తికరంగా సాగుతున్న ఈ టోర్నీలో.. లీగ్‌ దశ చివరికి చేరడంతో పలు జట్ల మధ్య మ్యాచ్‌లు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అదే సమయంలో రికార్డుల మీద రికార్డులు నమోదు అవుతున్నాయి. తాజాగా మరో రికార్డు నమోదైంది. అదేంటంటే... ఈ ప్రపంచకప్‌లో ఇప్పటికే అత్యధిక పెనాల్టీ గోల్స్‌ నమోదవ్వడం.
గతంలో ఏ ప్రపంచకప్‌ టోర్నీ మొత్తంలో నమోదుకానన్ని పెనాల్టీ గోల్స్‌ ఈ ఏడాది లీగ్‌ దశ ముగియకముందే నమోదు అయ్యాయి. సోమవారం స్పెయిన్‌-మొరాకో, ఇరాన్‌-పోర్చుగల్‌ మధ్య మ్యాచ్‌లు ముగిసే సమయానికి ఈ ప్రపంచకప్‌లో 20 పెనాల్టీ గోల్స్ నమోదయ్యాయట. 1990లో ఇటలీలో జరిగిన ప్రపంచకప్‌లో టోర్నీ మొత్తం కలిపి 18 పెనాల్టీ గోల్స్‌ నమోదవ్వడమే ఇప్పటి వరకూ అధికం. ఆ తర్వాత 1998, 2002లో జరిగిన ప్రపంచకప్‌ల్లోనూ 18 మాత్రమే నమోదయ్యాయి. 2014లో టోర్నీ మొత్తం కలిపి 13 పెనాల్టీ గోల్స్‌ నమోదయ్యాయి.
Recommended