Fifa world cup 2018 : Argentina Player Maradona Says Sorry For His Deeds
  • 6 years ago
Croatia head coach Zlatko Dalic said his side will not be changing their game when they face Group D favourites Argentina after opening their World Cup campaign with a 2-0 win over Nigeria.

రష్యా వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా శనివారం గ్రూపు-డి నుంచి శనివారం స్పార్టాక్ స్టేడియంలో అర్జెంటీనా, ఐస్‌ల్యాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా ఫుట్‌బాల్‌ దిగ్గజం డీగో మారడోనా స్టేడియంలో సిగర్ తాగుతూ కనిపించాడు.
పుట్‌బాల్ మ్యాచ్‌లు జరిగే సమయంలో స్టేడియం లోపల పొగ త్రాగడాన్ని నిషేధించారు. దీంతో నిబంధనలను అతిక్రమించిన మారోడోనాపై చర్యలు తీసుకునేందుకు టోర్నీ నిర్వాహకులు సిద్ధమౌతున్నారు. దీంతో తన తప్పు తెలుసుకున్న మారడోనా క్షమించాలని ఇనిస్టాగ్రామ్ వేదికగా కోరాడు.
అసలేం జరిగింది?
శనివారం అర్జెంటీనా, ఐస్‌ల్యాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు అర్జెంటీనా ఫుట్‌బాల్‌ దిగ్గజం మారడోనా స్పార్టక్‌ మైదానానికి వచ్చాడు. గ్యాలరీ నుంచి మ్యాచ్‌ వీక్షించే సమయంలో మారడోనా పొగ తాగుతూ కనిపించాడు.
అయితే, వరల్డ్ కప్ పోటీలు జరిగే సమయంలో అభిమానులు పొగతాగేందుకు గతంలో అనుమతి ఉంది. ప్రస్తుతం రష్యాలో జరుగుతున్న వరల్డ్ కప్ పోటీల్లో స్టేడియం లోపల పొగ తాగడంపై టోర్నీ నిర్వాహకులు నిషేధం విధించారు. దీంతో మారడోనాపై చర్యలు తీసుకునే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
Recommended