IPL 2018 Fina l: Dhoni Gives Shane Watson A New Name

  • 6 years ago
Former Australia all-rounder Shane Watson was back to his brutal best as he scored a scintillating 117 not out to help Chennai Super Kings to clinch their third Indian Premier League (IPL) title in front of a packed Wankhede crowd in Mumbai. For his whirlwind match-winning knock, Shane Watson earned accolades from all around the world.
#chennaisuperkings
#shanewatson
#Sunrisershyderabad
#ipl2018

ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. వాంఖడే వేదికగా జరిగిన సమరంలో క్రీజులో నిదానంగా పాతుకుపోయి బౌండరీల వర్షం కురిపించాడు. ఓపెనర్‌గా దిగిన వాట్సన్, డుప్లెసిస్‌లు భాగస్వామ్యం డుప్లెసిస్ అవుట్‌తో చెదిరిపోయింది. అయితే ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రైనా చక్కని సహకారం ఇవ్వడంతో.. షేన్ వాట్సన్ బౌండరీలే హద్దుగా చెలరేగి ఆడాడు. షేన్‌ వాట్సన్‌ 57 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సులతో నాటౌట్‌‌గా నిలిచి (117) పరుగులు చేశాడు.
ఈ అద్భుతమైన ఇన్నింగ్స్ కు కెప్టెన్ ధోనీ పొంగిపోయాడు. సాధారణంగా కూల్ గా ఉండే ధోనీ అతని ఆటతీరును చూసి ట్విట్టర్ వేదికగా ఆనందాన్ని పంచుకున్నాడు. ఇక నుంచి షేన్ వాట్సన్ .. షేన్ షేకింగ్ వాట్సన్ అని.. అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించాడని కొనియాడాడు. ఈ మ్యాచ్ విజయంతో సీజన్‌కు మంచి ముగింపు పలికామని పేర్కొన్నాడు.
ఫైనల్లో కుదురుకోవడానికి టైమ్ తీసుకున్న వాట్సన్.. పదకొండో బంతికి బౌండరీ బాది ఖాతా తెరిచాడు. తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగి 57 బంతుల్లోనే 117 పరుగులతో చెన్నైకి విజయాన్ని అందించాడు. వాట్సన్ విధ్వంసంతో 18.3 ఓవర్లలోనే చెన్నై సునాయసంగా గెలుపొందింది.

Recommended