IPL 2018: Dhoni Hints At Possible IPL Retirement
  • 6 years ago
At 36, not many expect MS Dhoni to continue playing international cricket for several years from here on. He himself has said several senior Chennai players, perhaps, won't be playing in the next two years.
#IPL2018
#Dhoni
#ChennaiSuperKings

రాబోయే రెండేళ్ల కాలంలో చెన్నై జట్టులో పెను మార్పులు చోటు చేసుకోనున్నాయని జట్టు కెప్టెన్ మహేంద్ర‌సింగ్ ధోనీ వెల్లడించాడు. ఎంతటి ఫామ్‌లో ఉన్నా వాళ్లు వయస్సు రీత్యా టీ20 ఫార్మాట్‌కు సరిపోరనే ఉద్దేశ్యంతో ఇలా భావిస్తున్నట్లు తెలిపాడు. జట్టును ఎంతో విజయవంతంగా నడిపిస్తోన్న ధోనీ ఇప్పటివరకూ జరిగిన 10 సీజన్లలో 8 సీజన్లకు చెన్నై జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ప్రస్తుత సీజన్‌ను సైతం అదే పంథాలో కొనసాగిస్తోన్న ధోనీ ఇటీవల మీడియాతో ముచ్చటిస్తూ ఇలా పేర్కొన్నాడు.
'యాజమాన్యం చాలా తెలివిగా వ్యవహరించింది. దాదాపు సామీప్యత ఉన్న వాళ్లందరినీ ఒక చోటకి చేర్చింది. వాళ్లంతా వ్యక్తిగతంగా జట్టుకు ఏం కావాలో ఎంత వరకూ చేయాలో తెలిసిన వాళ్లు కావడంతో కెప్టెన్ పనిని సులభతరమైపోతోంది. నాయకుడే కాదు. మంచి జట్టు లేకపోయినా ఆడడమనేది కష్టంగా ఉంటుంది. అందుకే మంచి ఆటగాళ్లను ఎంచుకుంటున్నాం. వాళ్లు మంచి ప్రదర్శన ఇస్తున్నారు.' అని అన్నాడు.
ఇంకా మాట్లాడుతూ.. 'మరో రెండేళ్లలో జట్టులో పెను మార్పులు చోటు చేసుకోనున్నాయి. జట్టులో ఉన్న కీలక ఆటగాళ్లు చాలా మంది షార్ట్ ఫార్మాట్ నుంచి రిటైర్ అయిపోతున్నారు.' అని వెల్లడించాడు. ఐపీఎల్‌లో భాగంగా జరిగిన 11సీజన్లలో 8 పూర్తి చేసుకుని 9వ సీజన్‌లో ఆడుతోంది. రెండేళ్ల నిషేదం అనంతరం పునరాగమనం చేసిన చెన్నై దూకుడుతో దూసుకుపోతోంది. ఆరంభం నుంచి పడిలేస్తూ.. ఫైనల్‌కు చేరింది.
Recommended