బజాజ్ డామినర్ మీద మళ్లీ పెరిగిన ధరలు

  • 6 years ago
దేశీయ దిగ్గజ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో తమ ఫ్లాగ్‌షిప్ మోటార్ సైకిల్ బజాజ్ డామినర్ 400 మీద ధరలు పెంపు చేపట్టింది. తాజాగా జరిగిన ధరల పెంపులో డామినర్ 400 మీద రూ. 2,000 లు పెరిగింది. ఈ ధరలు పెంపు బజాజ్ డామినర్ 400 లభించే రెండు వేరియంట్లకు వర్తిస్తుంది.

ధరల పెంపు అనంతరం బజాజ్ డామినర్ 400 నాన్-ఏబిఎస్ వేరియంట్ ధర రూ. 1.46 లక్షలు మరియు ఏబిఎస్ వేరియంట్ ధర రూ. 1.60 లక్షలు. రెండు ధరలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఇవ్వబడ్డాయి.

రెండు నెలలో వ్యవధిలో డామినర్ 400 మీద ధరలు పెంచడం ఇది రెండవసారి. ఈ ఏడాదిలో మొదటిసారి జరిగిన ధరల పెంపులో రూ. 2,000 ల వరకు పెంచింది. బజాజ్ ఆటో డామినర్ 400 మోటార్‌సైకిల్‌ను తొలుత డిసెంబర్ 2016లో విడుదల చేసింది. అప్పటి నుండి పలుమార్లు చేపట్టిన ధరల పెంపులో మొత్తం రూ. 10,000 వరకు ధరలు పెరిగాయి.

Read more at: https://telugu.drivespark.com/two-wheelers/2018/bajaj-dominar-price-hike-now-costs-rs-1-6-lakh/articlecontent-pf76312-012045.html

#Bajaj #BajajDominar #BajajDominar400

Source: https://telugu.drivespark.com

Recommended