కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలి : మోడీ
  • 6 years ago
Elections 2018 : BJP Star campaign from April 18,more than 20 big rallies scheduled. Star campaigner list include PM Narendra Modi, Yogi Adityanath, Smirti Irani, Devendra Fadnavis, Rajnath Singh and so on.

కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎలాగైనా ఇంటికి పంపించి అధికారంలోకి రావాలని బీజేపీ నాయకులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అందులో భాగంగా దేశంలోని ప్రముఖ బీజేపీ నాయకులతో కర్ణాటకలో ప్రచారం చేయించాలని పక్కాప్లాన్ వేస్తున్నారు. ఏప్రిల్ 18వ తేదీ నుంచి కర్ణాటకలోని అన్ని భాగాల్లో బీజేపీ ప్రముఖులతో ప్రచారం చేయించడానికి రంగం సిద్దం అయ్యింది.
బీజేపీ మొదటి జాబితాలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 72 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించింది. 72 మంది అభ్యర్థుల్లో దాదాపు అందరూ వారివారి నియోజక వర్గాల్లో ప్రచారం మొదలుపెట్టారు. ఏప్రిల్ 14 లేదా 15వ తేదీన రెండో జాబితాను విడుదల చెయ్యాలని బీజేపీ నాయకులు కసరత్తులు చేస్తున్నారు.
ఇప్పటికే మూడు సార్లు కర్ణాటకలో ప్రచారం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ సిద్దరామయ్య ప్రభుత్వాని సీధా రుపయ్య, కమీషన్ల ప్రభుత్వం అంటూ విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు ఒక్కటీ కర్ణాటకలో అమలు చెయ్యలేని, ఇక్కడి ప్రజలకు అన్యాయం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలని ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలకు పిలుపునిచ్చారు.
కర్ణాటకలోని సముద్ర తీరప్రాంతాల్లో హిందూ ప్రభావం అధికంగా ఉంది. సముద్రతీర ప్రాంతాల్లో ఉత్తరప్రదేశ్ ముఖ్మమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో ప్రచారం చేయించాలని నిర్ణయించారు. ఎన్నికల ప్రచారం కోసం 15 రోజులు యోగి ఆదిత్యనాథ్ కేటాయించారు. యోగీ అధిత్యనాథ్ 10 బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు.
కర్ణాటకలో శాసన సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా 20 ర్యాలీల్లో ప్రధాని నరేంద్ర మోడీతో సహ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, రాజ్ నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ, సుష్మాస్వరాజ్, మహారాష్ట్ర సీఎం దేవంద్ర ఫడ్నవిస్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తదితరులు ప్రచారం చేయ్యడానికి సిద్దం అయ్యారు.
Recommended