వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యూహంలో చిక్కుకోవద్దని చంద్రబాబుకు చెప్పాం: మోడీ

  • 6 years ago
I called up Andhra Pradesh CM Chandrababu Naidu and warned him that you are falling into YSRCP's trap, says PM Narendra Modi in Lok Sabha.

అవిశ్వాస తీర్మానం సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్‌తో పాటు ఏపీ సీఎం నారా చంద్రబాబుపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ప్యాకేజీకి అంగీకరించి ప్రశంసించిన ఆయన వైసీపీ ఉచ్చులో పడి, తన స్వార్థ ప్రయోజనాల కోసం యూటర్న్ తీసుకున్నారని ఆరోపించారు. ఆ రోజు తాను తల్లిని చంపి బిడ్డను కాపాడారని అన్నానని, ఇప్పుడు తెలుగు తల్లి స్ఫూర్తిని కాపాడాలని చెబుతున్నానని అన్నారు. టీడీపీ పెట్టిన అవిశ్వాస తీర్మానం ఘోరంగా వీగిపోయింది. మోడీకి మద్దతుగా 325 ఓట్లు (అవిశ్వాసానికి వ్యతిరేకంగా), అవిశ్వాసానికి అనుకూలంగా 126 ఓట్లు వచ్చాయి. పన్నెండు గంటల పాటు అవిశ్వాసంపై చర్చ జరిగింది. అవిశ్వాస తీర్మానంలో ఓటమికి ముందు మోడీ గంటకు పైగా మాట్లాడారు. వాజపేయి హయాంలో మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేస్తే ఎలాంటి గొడవలు లేవన్నారు. ఉత్తరాఖండ్, జార్ఖండ్, చత్తీస్‌గడ్ రాష్ట్రాలు వాజపేయి హయాంలో ఏర్పడ్డాయని గుర్తు చేశారు. కానీ ఎలాంటి గొడవలు రాలేదన్నారు. మీరు (కాంగ్రెస్) భారత్, పాకిస్తాన్‌ను విడగొట్టినప్పటి గొడవలు ఇప్పటికీ జరుగుతున్నాయని కాంగ్రెస్ పైన నిప్పులు చెరిగారు. ఇప్పుడు ఏపీ, తెలంగాణను కూడా అలాగే విభజించారన్నారు.

Recommended