IPL 2018 Opening Ceremony,Celebs Set Ready To Entertain

  • 6 years ago
IPL 2018 CSK coach Stephen Flemming Talks to media about their preparation for the season.He informed du Plessis was dropped from the match due to a hand injury.

తొలి మ్యాచ్ కోసం ఎంతో అతృతగా ఎదురు చూస్తున్నామని చెన్నై సూపర్ కింగ్స్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ అన్నాడు. శనివారం ఐపీఎల్ 11వ సీజన్‌కు తెరలేవబోతోంది. మొత్తం 51 రోజులు పాటు జరిగే ఈ ఐపీఎల్‌లో 8 జట్లు పాల్గొంటున్నాయి. 9 ప్రధాన నగరాల్లో 60 మ్యాచ్‌లను నిర్వహించనున్నారు.
టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్‌లో డిపెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కి ముంబైలోని వాంఖడె స్టేడియం ఆతిథ్యమిస్తోంది. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ మాట్లాడుతూ ముంబైతో పోరుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు.
‘ఈ ఏడాది ఐపీఎల్‌ కోసం బాగా సిద్ధమయ్యాం. కొంత ఆందోళనగా ఉన్నా.. వాంఖడే స్టేడియంలో మ్యాచ్ అంటే ఓ థ్రిల్‌ ఉంటుంది. ఈ సీజన్‌లో మా జట్టు తొలి మ్యాచ్‌ వాంఖడేలోనే ఆడుతుంది. ముంబై ఇండియన్స్‌పై గెలిచి టోర్నీకి శుభారంభం ఇవ్వాలని అనుకుంటున్నాం' అని ప్లెమింగ్ అన్నాడు.
'ఆటగాళ్లు కూడా ఈ రోజు గేమ్‌ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అనుభవం ఉన్న ఆటగాళ్లే ఈ టోర్నీలో కీలకపాత్ర పోషిస్తారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. మహేంద్ర సింగ్‌ ధోని, డ్వేన్‌ బ్రావో, షేన్‌ వాట్సన్‌, హర్భజన్‌ సింగ్‌లు మా జట్టును ముందుకు నడిపిస్తారు. ఈ ఏడాది మా జట్టు ఎంతో బలంగా ఉంది' అని ఫ్లెమింగ్‌ తెలిపాడు.
ఇదిలా ఉంటే డటం లేదని ఫ్లెమింగ్‌ ఈ సందర్భంగా తెలిపాడు. ఐపీఎల్ 11వ సీజన్ తొలి మ్యాచ్‌కు గంటన్నర ముందే ఐపీఎల్ ఆరంభ వేడుకలు ప్రారంభం కానున్నాయి.ముంబైలోని వాంఖడె స్టేడియంలో ఐపీఎల్ 11వ సీజన్‌కు అట్టహాసంగా తెరలేవనుంది.గంటల పాటు సాగే ఈ వేడుకలో బాలీవుడ్‌ తారలు తళుక్కుమనబోతున్నారు.

Recommended