Samantha,Naga Chaitanya Went To U.S For Vacation

  • 6 years ago
According to a leading daily, Samantha Akkineni and Naga Chaitanya have taken off to the US for a two-week-long vacation and will be back in India on April 6.

నాగ చైతన్య, సమంత వివాహం గతేడాది అక్టోబర్లో జరిగింది. అయితే అప్పటికే వారికి చాలా సినిమా కమిట్మెంట్లు ఉండటంతో పెళ్లయిన తర్వాత కూడా షూటింగుల్లో బిజీ బిజీగా గడిపారు. మధ్య మధ్యలో చిన్న చిన్న వెకేషన్స్‌కు వెళ్లినా అది వారికి పూర్తి స్థాయి సంతృప్తిని ఇవ్వలేదు. అందుకే ఈ కొత్త జంట రెండు వారాలు లాంగ్ వెకేషన్ వెళ్లారు. సమంత కమిటైన షూటింగులు ముగియడం, చైతూ చేస్తున్న సినిమా షెడ్యూల్ కూడా కాస్త గ్యాప్ దొరకడంతో ఇద్దరూ కలిసి 2 వారాల పాటు యూఎస్ఏకు హాలిడే ట్రిప్ వెళ్లారు.
యూఎస్ఏలోని వివిధ ప్రాంతాలు తిరుగుతూ సమంత, నాగ చైతన్య ఫుల్లుగా ఎంజాయ్ చేయబోతున్నారని, ఏప్రిల్ 6వ తేదీన వీరు తిరిగి హైదరాబాద్ వస్తారని సమాచారం. వచ్చాక ఎవరి షూటింగుల్లో వారు బిజీ కానున్నారు. సమంత నటించిన 'రంగస్థలం', 'మహానటి', 'ఇరుంబు తిరై' చిత్రాలు షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వెకేషన్ వెళ్లి వచ్చిన తర్వాత సామ్ తమిళ చిత్రాలైన సీమరాజా, సూపర్ డిలక్స్, తెలుగు మూవీ 'యూటర్న్' చిత్రాల షూటింగుల్లో జాయిన్ అవుతారు. ప్రస్తుతం నాగ చైతన్య సవ్యసాచి చిత్రం షూటింగులో పాల్గొనబోతున్నారు.

Recommended