అది అంత ఆషా మాషీ విషయం కాదు...!

  • 6 years ago
Needi Naadi Oke Katha movie gets with a Clean "U" Certification. Cast is the Sree Vishnu and Satna Titus. This movie releasing on 23rd March. A film directed by Venu Vudugula, Nara Rohith producing Aran Media Works. On occassion of movie release, Hero Sri Vishnu spoke to Telugu Filmibeat.

శ్రీవిష్ణు, సత్నా టైటస్ హీరో, హీరోయిన్‌గా నటిస్తున్న నీది నాదే ఒకే కథ చిత్రం మార్చి 23న రిలీజ్‌ సిద్ధమవుతున్నది. .అరన్ మీడియా వర్క్స్ బ్యానర్‌పై హీరో నారా రోహిత్ ఈ చిత్రానికి నిర్మాతగా వహిస్తున్నారు.
నీది నాది ఒకే కథ చిత్రంలో ఓ వెరైటీ కాన్సెప్ట్. సినిమా చూసినప్పుడు ప్రేక్షకుడు క్యారెక్టర్‌తో కనెక్ట్ అవుతాడు. చదువు పూర్తయిన తర్వాత లైఫ్‌లో సెటిల్మెంట్ అయ్యేవరకు జరిగే కథ. ఓ అతి సాధారణమైన తెలివితేటలు ఉన్న విద్యార్థి జీవితంలో పడే సంఘర్షణనే నీది నాది ఒకే కథ
పూర్తిగా మధ్య తరగతి వాతావరణం ఈ సినిమా నేపథ్యం. ఈ చిత్రంలో నా తండ్రిగా సినీ దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ నటించారు.
ఈ సినిమా రిలీజ్ డేట్ అనుకోకుండా తీసుకొన్న నిర్ణయం కాదు. చాలా పక్కగా సినిమాను ప్లాన్ చేస్తూ ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ లాంటివి రిలీజ్ చేస్తూ వచ్చాం.
నీది నాది ఒకే కథ సినిమా డాగ్ మీ 95 అనే కాన్సెప్ట్‌తో రూపొందించాం. దాదాపు 10 పాయింట్ల ఉంటాయి. అసలు ఖర్చు పెట్టకుండా సినిమాను తీయడం అనేది ప్రధానమైన అంశం. హైఎండ్ కెమెరాలు, క్రేన్లు, ఇతర ఎక్విప్‌మెంట్లు లేకుండా జీరో బడ్జెట్‌తో సినిమా చేయడం ఈ థియరీ ముఖ్య ఉద్దేశం.
ఈ కథ సినిమాను నారా రోహిత్, విజయ్, నేను కలిసి రూపొందించాం. ఇందులో నేను కూడా భాగస్వామినే.
మాస్ హీరో కావాలనుకోవడం చాలా కష్టమైనపని. కథలతో ప్రయోగం చేయాలన్నది నా కోరిక.మాస్ హీరో అంటే మామూలు విషయం కాదు.
నాకు బాలకృష్ణ అంటే చాలా ఇష్టం. హీరోగా మెప్పించడం అనేది ఎంత కష్టపడాలో అనే విషయాన్ని బాలయ్యను చూసి నేర్చుకొన్నాను.
వీరభోగ వసంత రాయలు సినిమా కోసం ప్రత్యేకంగా హెయిర్ కట్ చేయించారు. ఇలాంటి హెయిర్ కట్‌తో బయట తిరగాలంటే సిగ్గేస్తున్నది. ఆ సినిమాలో చాలా రకాల గెటప్స్‌లో కనిపిస్తాను.

Recommended