Skip to playerSkip to main contentSkip to footer
  • 3/24/2018
MLA, Needi Naadi Oke Katha, Rajaratha or Rajaratham have collected $43,118, $26,726 and $17,697, respectively, at the US box office from the premiere shows.

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన 'ఎంఎల్ఏ'(మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి) యూఎస్ఏ బాక్సాఫీసు వద్ద మంచి ఓపెనింగ్స్ సాధించింది. ప్రీమియర్ షోల ద్వారా ఈ చిత్రం 'నీదీ నాదీ ఒకే కథ', 'రాజరథం' చిత్రాలకంటే ఎక్కువే కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.
ఎంఎల్ఏ చిత్రాన్ని యూఎస్ఏలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు విడుదల చేశారు. నార్త్ అమెరికా వ్యాప్తంగా దాదాపు 150 థియేటర్లలో దాదాపు 200 ప్రీమియర్ షోలు గురువారం ప్రదర్శించారు. కళ్యాణ్ రామ్ కెరీర్లో అత్యధికంగా ప్రీమియర్ షోలు ప్రదర్శింపబడ్డ సినిమా ఇదే. ఉపేంద్ర మాధవ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ప్రేక్షకులు, సినీ విమర్శకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.
ఎర్లీ ఎస్టిమేషన్స్ ప్రకారం... ఎంఎల్ఏ మూవీ ప్రీమియర్ షోల ద్వారా $43,118 వసూలు చేసింది. ఇది కేవలం 63 లొకేషన్ల నుండి అందిన వివరాలు మాత్రమే. ఫైనల్‌గా అన్ని చోట్ల కలిపి ఎంత వసూలు చేసింది అనేది తెలియాల్సి ఉంది. ఇక 'నీదీ నాదీ ఒకే కథ' చిత్రం యూఎస్ఏలో 55 లొకేషన్లలో ప్రీమియర్ షోలు వేశారు. ఇప్పటి వరకు అందిన రిపోర్ట్స్ ప్రకారం ఈ చిత్రం $26,726 వసూలు చేసింది. శ్రీవిష్ణు కెరీర్లో ఇదే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమా. ఇక రాజరథం చిత్రం తెలుగు, కన్నడ భాషల్లో విడుదలైంది. దాదాపు 120 స్క్రీన్లలో ఈ చిత్రం విడుదలైంది. ఈ రెండు వెర్షన్లు ప్రదర్శితం అవుతున్న థియేటర్లు మంచి ఆక్సుపెన్సీ సాధించాయి. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం $17,697 వసూలైనట్లు తెలుస్తోంది. ఫైనల్ రిపోర్ట్ వచ్చే సమయానకి $20,000 డాలర్లు టచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

Recommended