ప్రత్యేక హోదా కోసం పవన్ కళ్యాణ్ ఆమరణ నిరాహార దీక్ష : మీరు సమర్దిస్తారా ?
  • 6 years ago
Jana Sena chief Pawan Kalyan warns modi with indefinite hunger strike over Special Status.

ఏపీకి ప్రత్యేక హోదా, ప్యాకేజీ, రైల్వే జోన్ కోసం అవసరమైతే తాను ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని, అవసరమైతే కాదు.. అవసరం పడుతుందనుకుంటున్నానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం గుంటూరు సభలో ప్రకటించారు.
తాను యువతను బలిదానాలు అడగనని, అవసరమైతే తానే బలిదానం అవుతానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రుడి ఆత్మగౌరవం భారత దశ ప్రభుత్వానికి రుచి చూపిద్దామన్నారు. పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో నడుద్దామన్నారు. అయితే పవన్ హోదాను తీసుకు రాగలడా అనే చర్చ సాగుతోంది.
ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రం ఇప్పటికే తేల్చేసింది. ఏ రాష్ట్రానికి ఇప్పుడు హోదా లేదని, ఏపీకి ఇవ్వలేమని చెప్పింది. దానికి బదులు సమానమైన ప్యాకేజీ ఇస్తామని చెప్పింది. కేంద్రం తేల్చేసిన నేపథ్యంలో పవన్ హోదా సాధన కోసం దీక్ష చేస్తారా లేక సమానమైన లాభం వస్తే ఊరుకుంటారా అంటే.. హోదా కంటే ఏపీకి ఆర్థిక లాభం కలిగితే చాలనేది ఆయన అభిప్రాయంగా చెబుతున్నారు.
ప్రత్యేక హోదా కోసం చాలా ఉద్యమాలు జరుగుతున్నాయి. నిన్నటి వరకు టీడీపీ, వైసీపీలు నాలుక మడతేశాయనే విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ.. ఇప్పుడు అవి కూడా హోదా కోసం పట్టుబడుతున్నాయి. ఇన్నాళ్లుగా పోరాడినా హోదా లేదని తేల్చిన కేంద్రం పవన్ పోరాడితే ఏ మేరకు స్పందిస్తుందని అంటున్నారు.
ప్రత్యేక హోదా కోసం పవన్ కళ్యాణ్ అవసరమైతే తెలంగాణ తరహా ఉద్యమానికి ముందుకు రావొచ్చని అంటున్నారు. అయితే ఆయన పదేపదే తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ఆయన చేతిలో ప్రజాప్రతినిధులు లేరు కాబట్టి ప్రజలను ఏకం చేసి, ఉద్యమిస్తారని, 2019 ఎన్నికల తర్వాత మరింత తీవ్రంగా ఉద్యమిస్తారా అనే చర్చ సాగుతోంది.
Recommended