TDP-BJP alliance on edge : It's Disadvantage NDA in Rajya Sabha
  • 6 years ago
A day after the Telugu Desam Party decided to quit the Union Cabinet, while putting the Bharatiya Janata Party-led National Democratic Alliance on notice period, It's Disadvantage NDA in Rajya Sabha


తెలుగుదేశం పార్టీ కేంద్ర కేబినెట్ నుంచి బయటకు రావడంతో బీజేపీకి ఇబ్బందులు తప్పవని అంటున్నారు. ఇటీవల టీడీపీ నేతలు కేంద్రమంత్రులుగా ఉన్నారు. అలాంటప్పుడు తమ పార్టీ ఎంపీలు సభలో ఆందోళన చేసినా వారు మౌనంగా కూర్చున్నారు.

కాబట్టి బీజేపీకి ఎదురుగాలిలా కనిపించలేదు. ఇప్పుడు వారు కూడా రాజీనామా చేసి ఆందోళనల్లో పాల్గొంటామని చెప్పడం గమనార్హం. ఏపీలో, రాజ్యసభలో బీజేపీకి చిక్కులు ఉంటాయని అంటున్నారు.

త్వరలో రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. మిత్రపక్షాలతో కలిసి కూడా రాజ్యసభలో తగినంత మెజార్టీ లేకపోవడం ఇప్పటికే బీజేపీని ఇబ్బందులకు గురి చేస్తోంది. ఇప్పుడు టీడీపీ కూడా కేబినెట్ నుంచి తప్పుకుంది. అయితే ఎన్డీయే నుంచి తప్పుకోలేదని చెప్పడం ఊరటే అయినప్పటికీ.. హోదా డిమాండ్ కోరుతూ వారు ఇరకాటంలో పెట్టే అవకాశాలుంటాయి.

మార్చిలో రాజ్యసభ ఎన్నికల తర్వాత బీజేపీ ఎంపీల సంఖ్య 73కు పెరిగే అవకాశముంది. అయినప్పటికీ మెజార్టీ 123కు చాలా దూరంలో ఉంటుంది. ప్రస్తుతం మిత్రపక్షాలతో కలిపి 82 స్థానాలు ఉన్నాయి. మార్చిలో జరిగే ఎన్నికల తర్వాత ఎన్డీయే రాజ్యసభ సభ్యుల సంఖ్య 97కు పెరిగే అవకాశముంది.
Recommended