Lok Sabha Clears Quota Bill: Now 10% Quota Bill in Rajya Sabha | అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్!!
  • 5 years ago
FM Arun Jaitley in Lok Sabha: This reservation bill ensures sabka saath, sabka vikas. It is a move for equality, will enable social upliftment. Lok Sabha passes 10% quota bill The bill will now be tabled in the Rajya Sabha on Wednesday.
#10percentreservation
#UpperCasteReservation
#reservationbill
#modi
#Mayawati

లోకసభ ముందుకు మంగళవారం అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ బిల్లు వచ్చింది. బిల్లును కేంద్రమంత్రి థావర్ చంద్ గెహ్లాట్ ప్రవేశపెట్టారు. 124వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. రాజ్యాంగ సవరణకు ఉభయసభల్లో మూడింట రెండు వంతుల మద్దతు అవసరం. అలాగే, సగం రాష్ట్రాలు దీనిని ఆమోదించాలి. బిల్లుపై చర్చ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడారు. ఆర్థికంగా వెనుకబడిన వారికి మేలు చేసేందుకు ఈ బిల్లును తీసుకు వచ్చామని చెప్పారు. బిల్లుకు రాష్ట్రాల ఆమోదం అవసరమని చెప్పారు. రాజ్యాంగ పీఠికలోనే సోషలిస్ట్ అనే పదాన్ని జత చేశారని చెప్పారు. కనుక మౌలికస్ఫూర్తిని అడ్డం పెట్టుకొని ఈ బిల్లును అడ్డుకోలేరన్నారు.

సమాన అవకాశాల సూత్రానికి రాజ్యాంగంలోనే మినహాయింపులు ఉన్నాయని జైట్లీ చెప్పారు. ప్రత్యేక పరిస్థితుల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని రాజ్యాంగమే చెబుతోందని అన్నారు. రాష్ట్రాల్లో పేదల రిజర్వేషన్ ప్రయత్నాలు విఫలమయ్యాయని చెప్పారు. ఈ ప్రయత్నాలు రాష్ట్రాల్లో విఫలం కావడం నిజమేనన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వారికి మేలు చేసేందుకు ఈ బిల్లు తీసుకు వచ్చామన్నారు.
Recommended