3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఈసీ..!
  • 6 years ago
Elections in Tripura will be held on February 18 while Meghalaya and Nagaland will vote on the 27th, the Election Commission has announced. Results for all three states will be declared on March 3.

మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాలకు ఎన్నికల తేదిలను ఖరారు చేస్తూ ప్రకటన జారీ చేసింది.
త్రిపుర రాష్ట్ర అసెంబ్లీకి ఈ ఏడాది ఫిబ్రవరి 18న ఎన్నికలు జరగనున్నాయి. మేఘాలయ, నాగాలండ్ రాష్ట్రాలకు ఫిబ్రవరి 27న, ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది.మార్చి 6వ, తేదిన త్రిపురలో కొత్త అసెంబ్లీ కొలువు దీరనుంది. మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల్లో కొత్త అసెంబ్లీ మార్చి 13, 14 తేదిల్లో కొలువుతీరనుంది. 1993 నుండి త్రిపుర రాష్ట్రంలో సిపిఎం నేతృత్వంలో లెప్ట్ ఫ్రంట్ అధికారంలో ఉంది. మేఘాలయలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. నాగాలాండ్ లో నాగా పీపుల్స్ ప్రంట్ నేతృత్వంలో ప్రభుత్వం అధికారంలో ఉంది
Recommended