Assembly Election Results : Tripura, Nagaland, Meghalaya
  • 6 years ago
Tripura, Nagaland, Meghalaya election results 2018, Early trends said fight in Tripura between CPM and BJP. At least two exit polls had predicted a BJP win in Tripura

ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు శనివారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైంది. ముఖ్యంగా త్రిపుర కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
కమ్యూనిస్టులకు త్రిపుర కంచుకోట. దశాబ్దాలుగా ఇక్కడ ఆ పార్టీదే ఆధిపత్యం. కానీ ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఈసారి బీజేపీ గెలుస్తుందని చెప్పాయి. ఈ నేపథ్యంలో తీవ్ర ఉత్కంఠ కనిపించింది. మార్పు నినాదంతో బీజేపీ బరిలోకి దిగింది. నాలుగు దఫాలుగా సీఎం పదవిలో కొనసాగుతూ అవినీతి మరక అంటని మాణిక్ సర్కార్ సీపీఎం ప్రధాన బలం. ప్రధాన బలం సీపీఎం, బీజేపీల మధ్యనే ఉంది.
60 స్థానాలకు గాను సీపీఎం 58 స్థానాల్లో మిత్రపక్షాలైన సిపిఐ, ఫార్వార్డ్ బ్లాక్‌లు ఒక్కో స్థానంలో పోటీ చేశాయి. బీజేపీ 51 స్థానాల్లో, మిత్రపక్షం ఐపీఎఫ్‌టీ 9 స్థానాల్లో పోటీ చేసింది. కాంగ్రెస్ 59 స్థానాల్లో, టీఎంసీ 24 స్థానాల్లో పోటీ చేశాయి.
మేఘాలయ, నాగాలాండ్‌లలో కూడా అరవై చొప్పున అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మూడు రాష్ట్రాల్లోను 59 స్థానాల్లోనే ఎన్నిక జరిగింది. ఎందుకంటే త్రిపురలో సీపీఎం అభ్యర్థి ఒకరు ఎన్నికలకు ముందు మృతి చెందారు. మేఘాలయలో ఓ ఎన్సీపీ అభ్యర్థి ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయారు. నాగాలాండ్‌లో ఎన్డీపీపీ అధ్యక్షులు నెయిపుయి రియో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఈశాన్యంలో ఏడు రాష్ట్రాలు ఉన్నాయి. వీటిలో బీజేపీ ఇప్పటికే 3 రాష్ట్రాల్లో జెండాను ఎగరవేసింది. ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో గెలుస్తారని ఎగ్జిట్ పోల్ సర్వేలు చెబుతున్నాయి. త్రిపుర, నాగాలాండ్‌లలో బీజేపీ గెలుస్తుందని, మేఘాలయలో హంగ్ వస్తుందని ఎగ్జిట్ పోల్ అంచనాలు వెల్లడించాయి.
Recommended