మసీదు మౌజస్ హత్య: చినరాజప్ప రాజీనామా కి డిమాండ్‌ ?

  • 6 years ago
The moujaes was lost life due to the massacre in Rajahmandry. In this background the Muslims were protesting on the national highway for justice. Chief Minister Chandrababu said that he had already spoken to the DGP about the case and that the accused will soon be arrest and punished.

రాజమహేంద్రవరంలో మసీదు మౌజస్ దారుణ హత్యకు గురవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మౌజస్ హత్య విషయం తెలిసి జాతీయ రహదారిపై ముస్లింలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. మరోవైపు ఈ హత్య కేసు విషయమై ఇప్పటికే డీజీపీతో మాట్లాడానని, హత్య కేసులో నిందితులను త్వరలోనే పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. శుక్రవారం వేకువజామున ఫజా కోసం గేటు కీపర్‌ గౌస్‌ మసీదులోకి వెళ్లి చూడగా ఫారూఖ్‌ తలపై బలమైన గాయాలతో విగతజీవుడై పడి ఉన్నాడు. పక్కనే ఖురాన్‌ కాల్చివేసి ఉండటంతో పాటు ప్రార్థనాస్థలం అగ్నికి ఆహుతై ఉన్నాయి. ఇమామ్‌ వెంటనే మసీదు కమిటీకి, పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ఈ హత్య శుక్రవారం వేకువ జామున జరిగి ఉంటుందని భావిస్తున్నారు.

బీహార్‌ రాష్ట్రం భగన్‌పూర్‌ జిల్లా బగార్థాకు చెందిన మహ్మద్‌ ఫారూఖ్‌ (61) మూడు నెలల క్రితం రాజమహేంద్రవరం లాలాచెరువులోని నూరానీ మసీదులో మౌజస్ గా అంటే చిన్నమతగురువుగా చేరి అక్కడే నివాసం ఉంటున్నాడు. మృతునికి భార్య, ముగ్గురు కుమారైలు, ముగ్గురు కుమారులు ఉన్నారు.

Recommended