హాట్ హాట్‌గా రకుల్ రెచ్చిపోయిందిగా

  • 7 years ago
Actor Karthi Shiva kumar now is aiming to make it big in both Tamil and Telugu industries. Accordingly, his upcoming action entertainer 'Khaki', directed by H Vinoth is gearing up for a huge release in Telugu states as well.
దక్షిణాది చిత్ర పరిశ్రమలో అందాల తార రకుల్ ప్రీత్ సింగ్ దుమ్ము దులిపేస్తున్నది. నటనకు స్కోప్ ఉన్న పాత్రలకు ప్రాధాన్యం ఇస్తూనే తెర మీద గ్లామర్‌ను పండిస్తున్నది. రారండోయ్ వేడుక చూద్దాం, జయ జానకి నాయక, స్పైడర్ చిత్రాలు రకుల్ ప్రతిభకు అద్దం పట్టాయి. తాజాగా రకుల్ నటించిన ఖాకి. ఈ చిత్రం నవంబర్‌ 17న రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలో ఇటీవల విడుదల చేసిన ప్రోమో సాంగ్ వీడియో వైరల్‌గా మారింది. ఇప్ప‌టివ‌ర‌కు ఎన్నో సినిమాల‌తో త‌మిళ ప్రేక్ష‌కుల‌నే కాకుండా తెలుగువారిని కూడా అల‌రించిన కార్తి ఈ సినిమాలో హీరోగా న‌టించారు. తెలుగు చిత్రాల్లో బ‌బ్లీగానూ, పెర్ఫార్మ‌ర్‌గానూ పేరు తెచ్చుకున్న గ్లామ‌ర్ భామ ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా న‌టించారు.
ఖాకి చిత్రంలోని తొలి వయసే పాట వీడియోను ప్రమోషనల్ కార్యక్రమం కోసం విడుదల చేశారు. ఈ పాట ఇప్పటికే ప్రేక్షకులను విశేషంగా ఆకర్షిస్తున్నది. తొలి వయసే పాటలో రకుల్, కార్తీ కెమిస్ట్రీ అదిరిపోయింది. ఈ పాటలో ఇద్దరు హాట్‌ హాట్‌గా కనిపించారు.ఖాకి చిత్రం స‌మాజానికి ర‌క్ష‌ణ క‌ల్పించ‌డంలో పోలీసుల త‌ర్వాతే ఎవ‌రైనా! వారు చేసే క‌ష్టానికీ, తీసుకునే జీతానికీ ఎక్క‌డా పొంత‌నే ఉండ‌దు. అయినా నిత్యం ప్ర‌జ‌ల సంర‌క్ష‌ణ‌కు పాటుప‌డుతుంటారు. మ‌రి అలాంటి పోలీసులకు వ్య‌క్తిగ‌త జీవితం ఎలా ఉంటుంది? ఒత్తిళ్ల‌తో కూడిన ఉద్యోగాన్ని ఎలా నిర్వ‌ర్తిస్తారు. మ‌న‌లో ఒక‌డిగా మెలిగిన వ్య‌క్తి ఒంటిమీద‌కు పోలీస్ యూనిఫార్మ్ రాగానే ఎలా మ‌స‌లుకుంటాడు? ఎలా మ‌స‌లుకోవాలి? త‌న మ‌న‌సును, కుటుంబాన్ని, ఉద్యోగాన్ని అత‌ను స‌మ‌న్వ‌యం చేసుకునే తీరు ఎలా ఉంటుంది? వంటి ఆస‌క్తిక‌ర‌మైన అంశాల‌తో తెర‌కెక్కింది.

Recommended