రేవంత్‌లో ఓటమి భయం : డిసెంబర్ 9న ముహూర్తం

  • 6 years ago
Even though pressure is mounting on him to face the bypoll, Kodangal MLA A Revanth Reddy is unlikely to submit his resignation from the membership of the House directly to the Telangana Assembly speaker any time now. This means the possibility of a byelection seems remote.

కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డిని మీడియానే హీరోగా చేసిందని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. రేవంత్ కాంగ్రెస్ పార్టీలో చేరాక రాజకీయాలు వేడెక్కిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనపై టీఆర్ఎస్, టీడీపీ నేతలు మండిపడుతున్నారు.బాహుబలి వంటి టైటిల్స్‌తో రేవంత్ రెడ్డిని మీడియా హైలెట్ చేసిందని టీఆర్ఎస్ నేత నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి అన్నారు. కానీ అదే మీడియా ఆయన తన ఎమ్మెల్యే పదవికి ఎందుకు రాజీనామా చేయలేదో అడగడం లేదని ప్రశ్నించింది.
ఇప్పటికే తన రాజీనామా పత్రాన్ని చంద్రబాబుకు ఇచ్చిన రేవంత్ తెలంగాణ స్పీకర్‌కు ఇచ్చే అవకాశం లేదని అంటున్నారు. రాజీనామా విషయంలో ఆయన సేఫ్ గేమ్ ఆడుతున్నారని తేలిపోయిందని చెబుతున్నారు. ఆయనకు చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు రాజీనామాను ఫార్వార్డ్ చేయకుంటే స్పీకర్‌కు రాజీనామా సమర్పించవలసి ఉండె అంటున్నారు. ఇప్పటి వరకు దానిపై స్పందించలేదంటే ఆయన ఉద్దేశ్యం ఏమిటో తేలిపోయిందని చెబుతున్నారు.

Recommended