Virat Kohli equals Ricky Ponting's world record

  • 6 years ago
The only other captain who has taken a team to 9 consecutive Test series wins other than Kohli is Australian captain Ricky Ponting.

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ఫిరోజ్ షా కోట్లా వేదికగా భారత్-శ్రీలంక జట్ల మధ్య జరిగిన చివరి టెస్టు డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. చివరి రోజు టీమిండియా విజయానికి 7 వికెట్లు అవసరం కాగా 87 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే తీయగలిగారు.
దీంతో మూడు టెస్టుల సిరిస్‌ను భారత్ 1-0తో కైవసం చేసుకుంది. కెప్టెన్‌గా కోహ్లీకి ఇది వరుసగా తొమ్మిదో సిరీస్‌ విజయం కావడం విశేషం. తద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో వరుసగా అత్యధిక టెస్టు సిరిస్ విజయాలు సాధించిన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ రికార్డుని కోహ్లీ సమం చేశాడు.
2005 నుంచి 2008 మధ్య కాలంలో పాంటింగ్‌ నేతృత్వంలోని ఆస్ట్రేలియా జట్టు వరుసగా తొమ్మిది సిరీస్‌లను గెలిచింది. ఇంగ్లండ్‌ జట్టు కూడా 1884 నుంచి 1892 మధ్యకాలంలో తొమ్మిది టెస్టు సిరీస్‌లలో విజయాలు సాధించింది. 2015లో ధోని నుంచి టెస్టు కెప్టెన్సీ పగ్గాలను అందుకున్న కోహ్లీ తొలి టెస్టు సిరిస్‌ను లంకపైనే గెలవడం విశేషం.

Recommended