ACB Raids in Khwaja Moinuddin House : తెలంగాణలో సంచలనం సృష్టించిన గొర్రెల పంపిణీ కుంభకోణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసు దర్యాప్తు భాగంగా గురువారం రాత్రి కోకాపేటలోని యూవీ టవర్స్‌లో కాంట్రాక్టర్ మొయినుద్దీన్ భార్య నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. సోదాల్లో కీలక డాక్యమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అతడి ఖాతా నుంచి భార్య ఖాతాకు నగదు బదిలీ అయినట్లు అధికారులు గుర్తించారు. మొదటగా సోదాలను మొయినుద్దీన్ భార్య అడ్డుకోగా, అధికారులు సెర్చ్ వారెంట్ చూపించి సోదాలు చేశారు. గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం అర్ధరాత్రి 2.30 గంటల వరకు చేశారు. రెండు కార్లను సీజ్ చేసి ఏసీబీ కార్యాలయానికి తరలించారు.