AP Teachers Transfer Act 2025 : శాసనసభలో విద్యాశాఖకు సంబంధించిన రెండు బిల్లులను ఆ శాఖ మంత్రి లోకేశ్ ప్రవేశపెట్టారు. 2025 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయ బదిలీల క్రమబద్ధీకరణ బిల్లుతో పాటు ప్రైవేట్ విశ్వవిద్యాలయాల సవరణ బిల్లును ప్రవేశపెట్టగా వాటికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఉపాధ్యాయ బదిలీల చట్టమనేది ఒక చరిత్రని లోకేశ్ స్పష్టంచేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అడ్డగోలుగా టీచర్లను ట్రాన్స్ఫర్ చేశారని మండిపడ్డారు.