Central Government has Announced Advance Of Rs. 2,705 Crore For Polavaram : పోలవరం ప్రాజెక్టు సాకారం దిశగా మరో అడుగు పడింది. పాజెక్టు నిర్మాణం కోసం 2,705 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు కేంద్ర జలశక్తి, ఆర్థికశాఖలు పచ్చజెండా ఊపాయి. మొత్తంగా ఈ ఆర్థికసంవత్సరంలోనే 5,512 కోట్ల రూపాయలను కేంద్రం ఇచ్చింది. ఇంత పెద్ద మొత్తంలో నిధులివ్వడం ఇదే తొలిసారని అధికారులు చెబుతున్నారు.