Father Supari Plan For Daughter Love Marriage : తన కూతురు ప్రేమ వివాహానికి సహకరించిన వ్యక్తి హత్యకు సుపారి ఇచ్చాడో తండ్రి. కోడి కత్తులతో పొడిచి హత్య చేసేందుకు పక్కా ప్రణాళిక వేశారు. హత్య చేసేందుకు రిక్కీ చేస్తుండగా చివరికి పోలీసులుకు చిక్కారు. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలంలో జరిగింది. నందిగామ ఏసీపీ తిలక్ కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. నందిగామ మండలం ఐతవరం గ్రామానికి చెందిన మువ్వ వీర్రాజు అనే వ్యక్తిని 14 నెలల క్రితం ఏ. కొండూరు మండలం కోడూరు గ్రామానికి చెందిన కోలా నరసింహారావు కుమార్తె రమ్యశ్రీ ప్రేమించి వివాహం చేసుకుంది.