ACB And Ed inquiries On Formula E Race Case : సంచలనం రేపుతున్న ఫార్ములా - ఈ రేసు కేసులో వేర్వేరు దర్యాప్తు సంస్థల ఎదుట హాజరైన నిందితులు ఇద్దరూ తాము ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే నడుచుకున్నామని చెప్పినట్లు తెలుస్తోంది. ఇందులో తమ పాత్ర ఏమీలేదని, నిబంధనల ఉల్లంఘన కూడా జరగలేదని స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ కేసు దర్యాప్తులో భాగంగా నాటి ఎంఏయూడీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, హెచ్ఎండీఏ పూర్వ కమిషనర్ అర్వింద్‌కుమార్‌ను అనిశా; విశ్రాంత చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు బుధవారం ప్రశ్నించారు. వారిద్దరి వాంగ్మూలాలు నమోదు చేశారు.