Sabala Millets Stall in Manikonda : హైదరాబాద్ మణికొండ ల్యాంకో హిల్స్‌లో నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా రామోజీ గ్రూపు ఆధ్వర్యంలో సబల స్టాల్ ఏర్పాటు చేశారు. ఇటీవలే సబల పేరిట మార్కెట్లోకి తీసుకొచ్చిన చిరుధాన్యాల ఉత్పత్తులు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మిల్లెట్ నూడిల్స్, ప్రొటీన్ మీల్ బార్, మల్టీ మిల్లెట్ టిఫిన్ మిక్స్, వన్ పాట్ మిల్లెట్ మీల్ మిక్స్, ప్రొటీన్ డేట్ అండ్ అల్మండ్ బార్, ప్రొటీన్ మీల్ బార్, మిల్లెట్ పఫ్స్, మిల్లెట్ జాగరీ కుకీస్, బేక్డ్ మిల్లెట్ నట్ క్రాకర్ వంటివి చిరు ధాన్యాల మీద ఆసక్తి కలిగిస్తున్నాయి.