Sri Tej Father Bhaskar About Her Son Health Condition : సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలుడు శ్రీతేజ్ తండ్రి భాస్కర్, తొక్కిసలాటపై పెట్టిన కేసు వెనక్కి తీసుకునేందుకు సిద్ధమని ప్రకటించారు. ఇవాళ ఆయన కిమ్స్ ఆసుపత్రిలో మీడియాతో మాట్లాడారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి అల్లు అర్జున్ ప్రతిరోజు తెలుసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. శ్రీతేజ్ ఇప్పుడిప్పుడే కళ్లు తెరిచి చూస్తున్నాడని అన్నారు. అయితే ఇంకా తమను గుర్తించట్లేదని వెల్లడించారు.