AP Minister On Tirumala Recommendation Letters : తిరుమలలో తెలంగాణ నుంచి వచ్చే సిఫార్సు లేఖల స్వీకరణపై స్పష్టత వచ్చింది. టీటీడీకి కొత్త బోర్డును నియమించిన తరువాతే తెలంగాణ నుంచి వచ్చే అన్ని సిఫార్సు లేఖలను స్వీకరిస్తామని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. ఆయన ఇవాళ యాదాద్రిలోని శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆయనకు ఈవో భాస్కర్ రావు, ఆలయ సంప్రదాయ స్వాగతం పలికారు. గర్భగుడిలో ప్రత్యేక పూజల అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. అనంతరం లడ్డు ప్రసాదం, స్వామి వారి చిత్ర పటాన్ని ఆలయ ఈఓ భాస్కర్ రావు అందజేశారు.