ఎవరో దుండగులు తమ ర్యాలీలో చొరబడి కుట్ర చేశారని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘ఇటీవల సికింద్రాబాద్లో ప్రశాంత వాతావరణంలో ర్యాలీ నిర్వహించాం. భాజపా కార్యకర్తల ముసుగులో కొందరు చేరి రాళ్లు, చెప్పులు విసిరారు. పారిపోతున్న వారిని పట్టుకుని మరీ పోలీసులు చితకబాదారు.