'Raa Raa' Movie Review రా..రా... సినిమా రివ్యూ
  • 6 years ago
Horror-Comedy film 'Raa Raa' released on 23rd February. Srikanth, Naziya, Seetha Narayana played the main lead roles. Vizi Charish units handled the camera department.

ప్రస్తుత జనరేషన్‌లో శ్రీకాంత్ యాక్టింగ్‌కు టాలీవుడ్‌లో ఓ మార్కు ఉంది. విలనిజం, కామెడీ, హీరోయిజం, క్యారెక్టర్ ఆర్టిస్టుగా శ్రీకాంత్ నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. 100కుపైగా చిత్రాల్లో నటించిన అనుభవం ఉన్న శ్రీకాంత్ తొలిసారి రా రా అనే ఓ హారర్, కామెడీ చిత్రంలో నటించాడు. హారర్, కామెడీ చిత్రంలో శ్రీకాంత్ అభిమానులను, ప్రేక్షకుడిని మెప్పించాడా అనే విషయం తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
హాలీవుడ్ స్థాయిలో భారీ బడ్జెట్ చిత్రాలు రూపొందించాలనే తపన ఉన్న డైరెక్టర్ శ్రీకాంత్. తన తండ్రి (గిరిబాబు) కూడా 100 చిత్రాలు తీసిన గొప్ప డైరెక్టర్. అయితే శ్రీకాంత్ తీసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతుంటాయి. చివరకు తండ్రినే నిర్మాతగా పెట్టి శ్రీకాంత్ సినిమా తీస్తాడు. కానీ అదీ కూడా ఫట్ మనడంతో తండ్రి గుండె ఆగి చనిపోతాడు. తల్లి అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరుతుంది. ఓ శుభవార్త లాంటి చెప్పితేనే తల్లిని రక్షించుకోగలుగుతావు. ఓ హిట్ సినిమా తీస్తే తల్లి ఆరోగ్యం కుదుటపడవచ్చు అని శ్రీకాంత్‌తో డాక్టర్ చెబుతాడు. దాంతో దెయ్యం కథతో హిట్ సినిమా తీసే పనిలో పడుతాడు.
ఓ పాడుబడిన ఇంట్లోకి చేరిన శ్రీకాంత్ బృందం దెయ్యాల బారిన పడుతుంది. దెయ్యాల బారిన పడిన శ్రీకాంత్ టీమ్‌కు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? ఇంతకు శ్రీకాంత్ హిట్ సినిమా తీసి తల్లిని రక్షించుకొన్నాడా? సినిమా తీసే క్రమంలో దెయ్యం (నాజియా)తో ప్రేమలో పడిన శ్రీకాంత్ లవ్‌స్టోరీ ముగింపు ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే రారా సినిమా కథ
అడవిలో ఓ పాడుబడిన ఇంటిలో ఉన్న దెయ్యాలను తరమికొట్టేందుకు ఓ విదేశీ బృందం రావడం, మృత్యవాత పడటంతో సినిమా ప్రారంభమవుతుంది. శ్రీకాంత్ సినిమాల ఫ్లాప్‌లతో కథ సాగుతుంటుంది. తండ్రి మరణించడం, తల్లికి జబ్బు చేయడం లాంటి అంశాలకు సెంటిమెంట్ కలిపి కథలో కొంత ఆసక్తిరేపే ప్రయత్నం జరుగుతుంది. అయితే నాసిరకమైన కథ, కథనాలతో సినిమా ఏంటో ప్రేక్షకుడికి ఇట్టే అర్థమవుతుంది. రఘుబాబు, హేమ దెయ్యాల బృందం ఎపిసోడ్ ప్రేక్షకుడికి నరకయాతనగా మారుతుంది. ఇదిలా ఉండగానే మరో దెయ్యాల బృందం ఇంట్లోకి చేరడంతో ఇంటర్వెల్ పడుతుంది.
Recommended