Hydra Changed Tactics : హైదరాబాద్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలో హైడ్రా తన వ్యూహాన్ని మార్చుకుంది. చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లపై రీసర్వే చేసి కొత్తగా మార్క్ చేశాకే కూల్చివేతలకు దిగబోతుంది. ఇప్పటికే శాశ్వత నివాసాలు ఏర్పాటు చేసుకొని నివసిస్తున్న వారి జోలికి వెళ్లబోమని హైడ్రా ప్రకటించింది. కొత్తగా నిర్మించే ఆవాసాల కూల్చివేతలకు సంబంధించి బిల్డర్ల ద్వారా బాధితులకు పరిహారం ఇప్పించేలా అండగా ఉండాలని నిర్ణయించుకుంది.