Komal Priya on Agriculture Course : కష్టాలు, కన్నీళ్లు పోవాలంటే చదువొక్కటే మార్గం అనుకుందా ఆ అమ్మాయి. సకాలంలో ఫీజు కట్టలేదని పాఠశాల ఉపాధ్యాయులు అవమానించినా భరించింది. ఆ బాధను అమ్మానాన్నకు తెలియనివ్వకుండా పట్టుదలతో చదివింది. అత్యధిక మార్కులు సాధించి ఉచిత విద్యకు అర్హత సాధించింది. అదే ప్రతిభను యూనివర్సిటీ స్థాయిలో ప్రదర్శించి ఏకంగా 6 బంగారు పతకాలు సాధించింది. పేదింటి విద్యాకుసుమం కోమల్ ప్రియ కథే ఇది.