Drug Peddler Mastan Sai Arrested: డ్రగ్స్ కేసులో గుంటూరు నగరానికి చెందిన రావి సాయి మస్తాన్‌రావును విజయవాడ సెబ్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఇటీవల వార్తల్లో నిలిచిన హీరో రాజ్‌తరుణ్, లావణ్యల వివాదంలో సాయి మస్తాన్‌రావు పేరు తెరపైకి వచ్చింది. సాయిపై డ్రగ్స్ సరఫరాకు సంబంధించి ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అరెస్టు చర్చనీయాంశం అయింది. రెండు నెలల క్రితం రైలులో డ్రగ్స్ తెస్తూ పట్టుబడిన వ్యక్తి అరెస్టుతో రావి సాయి వ్యవహారం బయటకు వచ్చింది. అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. సోమవారం గుంటూరులో సెబ్ పోలీసులు అరెస్టు చేశారు.