Farmers Crop Loans : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పంట రుణ లక్ష్యాలు చేరుకోవడంలో, బ్యాంకర్లు దారుణంగా విఫలమవుతున్నారు. హనుమకొండ, ఖమ్మం, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి లాంటి జిల్లాలు, వందశాతం లక్ష్యం చేరుకుంటే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 51శాతమే రుణాలిచ్చి చేతులు దులిపేసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో రుణమాఫీ జాప్యం, రుణాల రెన్యూవల్ చేసుకోకపోవడం లాంటి కారణాలు చూపి అప్పులు ఇవ్వలేదు. ఇప్పుడు 2లక్షల రుణమాఫీ నేపథ్యంలోనైనా, లక్ష్యం మేరకు రుణాలివ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.