పంజాబ్‌లో ఆమ్ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తుందంటూ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే నిజమవుతోంది.పంజాబ్ అసెంబ్లీలో ఉన్న సీట్ల సంఖ్య 117.ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ 59. దీన్ని ఆమ్ ఆద్మీ పార్టీ అందుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి, 60 నుంచి 67 సీట్లను సాధిస్తుందని తేల్చాయి.