S Sreesanth Comeback : 2013 IPL స్పాట్ ఫిక్సింగ్.. 10 లక్షల కోసం చేస్తానా? || Oneindia Telugu
  • 3 years ago
S Sreesanth has finally spoken on the 2013 saga in the Indian Premier League (IPL). The 38-year-old Sreesanth has opened that why would he do something like that for 10 lakhs as he had similar amount of bills in parties itself.
#SSreesanthComeback
#2013IPLIssue
#TeamIndia
#SSreesanthBowling
#BCCI
#T20Worldcup
#IPL2021


ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) ‌స్పాట్ ఫిక్సింగ్ ఉదంతంపై భారత వెటరన్ ఫాస్ట్ బౌలర్, కేరళ ఆటగాడు ఎస్ శ్రీశాంత్ మరోసారి స్పందించాడు. కేవలం 10 లక్షల రూపాయల కోసం తాను స్పాట్ ఫిక్సింగ్ ఎందుకు చేస్తానని ప్రశ్నించాడు. తాజాగా ఎస్ శ్రీశాంత్ ఓ క్రీడా ఛానెల్లో మాట్లాడుతూ... 'ఆ సమయంలో నేను ఇరానీ ట్రోఫీ ఆడాను. ఇక సెప్టెంబర్ 2013లో దక్షిణాఫ్రికా సిరీస్ కోసం సిద్దమవుతున్నా. మంచి ప్రదర్శన చేసి ఆ సిరీస్ ఆడాలన్నదే నా లక్ష్యం. అందుకే ముందుగానే ప్రాక్టీస్ ఆరంబించా. అలాంటి ఆలోచనలో ఉన్న నేను కేవలం 10 లక్షల కోసం ఫిక్సింగ్ చేస్తానా?. ఓసారి పార్టీ చేసుకుంటే.. ఆ బిల్లే 2 లక్షలు అవుతుంది. అలాంటి వాడిని 10 లక్షల కోసం ఫిక్సింగ్ చేస్తానా? ఇది మీ ఆలోచనకే వదిలేస్తున్నా' అని అన్నాడు.
Recommended